ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Covid-19 : ఏపీలో 11 కొవిడ్‌ మరణాలు.. కొత్తగా 1179 కేసులు

ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా1,179 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,40,708 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గత 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల 11 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,089కి చేరింది. ఒక్క రోజులో 1,651 మంది బాధితులు కోలుకున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,12,714కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,905 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.