భారత వాయుసేన దళపతిగా ఆర్కేఎస్ బదౌరియా స్థానంలో వీఆర్ చౌదరి నియమితులు కానున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దాంతో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఆయన ప్రస్తుతం ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 1982 డిసెంబర్ 29న ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. పలు రకాల యుద్ధ, శిక్షణ విమానాల్లో ఆయనకు 3,800 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసుల స్టాఫ్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఆయన వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు.
వాయుసేన కొత్త చీఫ్‌గా వివేక్ రామ్ చౌదరి