తెలంగాణ ముఖ్యాంశాలు

సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాల‌యం కీల‌క నిర్ణ‌యం

సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాల‌యం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వంద శాతం అపాయింట్‌మెంట్ల‌కు పాస్‌పోర్టు కార్యాల‌యం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కొవిడ్ ప్ర‌భావం త‌గ్గుద‌ల‌తో వంద శాతం అపాయింట్‌మెంట్ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

అన్ని పాస్‌పోర్టు కేంద్రాల్లో వంద శాతం అపాయింట్‌మెంట్ల నిర్ణ‌యం వెంట‌నే అమల్లోకి వ‌స్తుంద‌ని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌లో సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జా విచార‌ణ కేంద్రం అందుబాటులో ఉండ‌నుంది. అపాయింట్‌మెంట్లపై భారీగా ఫిర్యాదులు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాస‌రి బాల‌య్య వెల్ల‌డించారు.