తెలంగాణ

సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు

సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2.19 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేలా సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ ప్రాజెక్టును రూ. 2,653 కోట్ల‌తో నిర్మించ‌నున్నారు. 1.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేలా బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోల‌ను రూపొందించారు. రూ. 1,774 కోట్ల వ్య‌యంతో ఈ ప్రాజెక్టును నిర్మించ‌నున్నారు.