కరోనా కట్టడికి తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులనివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు దరఖాస్తు చేసినట్టు నోవావాక్స్, సీరం సంస్థలు వెల్లడించాయి. వైరస్‌కు వ్యతిరేకంగా యాంటిబాడీలను ఉత్పత్తి చేయడంలో తమ టీకా 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నదని, మిగతా టీకాలతో పోలిస్తే తమ వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం, తరలించడం సులభమని వివరించాయి. పేద దేశాలకు టీకాలను సరఫరా చేయడానికి ఐక్యరాజ్యసమితి తీసుకొచ్చిన కొవాక్స్ కార్యక్రమానికి 35 కోట్ల డోసులను ఇస్తామని నోవావాక్స్ ఒప్పందం కుదుర్చుకున్నది.
అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి!