ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

విశాఖపట్నం: నేడు క్రూయిజ్‌ టెర్మినల్‌ పనులకు శంకుస్థాపన

అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు విశాఖ పోర్టులో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ అభివృద్ధి పనులకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాగూర్‌ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి గురువారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

క్రూయిజ్‌ టెర్మినల్‌ అభివృద్ధి పనులుతో పాటు ఓఆర్‌ఎస్‌ జెట్టీ మరమ్మతు పనులు, కవర్డ్‌ స్టోరేజ్‌ యార్డ్‌ నిర్మాణ పనులు, ఐఎన్‌ఎస్‌ డేగ వద్ద ట్రక్కు పార్కింగ్‌ టెర్మినల్‌ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటనలో ఆయన వెంట పోర్ట్‌ చైర్మన్‌ రామమోహనరావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.