తెలంగాణ

TS PECET 2021| టీఎస్ పీఈసెట్ -2021 ప్ర‌వేశ ప‌రీక్ష వాయిదా

టీఎస్ పీఈసెట్ -2021(TSPECET-2021) ప్ర‌వేశ ప‌రీక్ష వాయిదా పడింది. ఈ మేర‌కు మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నెల 30న నిర్వ‌హించాల్సిన టీఎస్ పీఈసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్నామ‌ని తెలిపారు. అక్టోబ‌ర్ 23న‌(శ‌నివారం) ఈ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే జారీ చేసిన హాల్ టికెట్ల‌నే అక్టోబ‌ర్ 23న తీసుకురావాల‌ని, సెంట‌ర్ల విష‌యంలో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని అధికారులు పేర్కొన్నారు.