తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని నిలిపి వేయాలని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో ఈటల రాజేందర్‌పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు నిలిపివేయాలని చెప్పడానికి ఈటలకు హక్కు లేదని దళితులు మండిపడుతున్నారు.
వీణవంక మండలం వల్లబ్‌పూర్, మామిడాలపల్లిలో, జమ్మికుంట, కరీంనగర్ ప్రధాన రహదారిపై దళితులు ధర్నాకు దిగారు. ఈటల డౌన్.. డౌన్.. వాడెవ్వడు వీడెవ్వడు దళిత బంధుకడ్డెవ్వడని దళితులు నినాదాలు చేస్తున్నారు. దళిత బంధును వ్యతిరేకిస్తున్న ఈటల ఓటమి ఖాయమైందని హెచ్చరించారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి నిరసన తెలిపారు.