తెలంగాణ ముఖ్యాంశాలు

నిజామాబాద్‌లో యువతిపై సామూహిక అత్యాచారం

నిజామాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి బలవంతంగా మద్యం తాగించి.. బస్టాండ్‌ సమీపంలోని దవాఖాన గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నింధితుల కోసం గాలిస్తున్నారు.