మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 13,401 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 13,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం 638.50 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. మూసీ గరిష్ట సామర్థ్యం 4.46 టీఎంసీలుకాగా, 2.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
పులిచింతల ఐదు గేట్లు ఎత్తివేత
పులిచింతలకు వరద పోటెత్తడంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 70,812 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 61,358 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 33.40 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.