ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానాన్ని గురువారం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇండిగోకు చెందిన 6E-946 కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు సాయంత్రం 4.40గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓ ప్రయాణుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు సిబ్బందికి తెలుపడంతో వెంటనే విమానాన్ని భువనేశ్వర్‌కు మళ్లించినట్లు ఒడిశాలోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.
సాయంత్రం 5.55 గంటల సమయంలో విమానం ల్యాండ్ కాగా.. వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహించారు. సదరు వ్యక్తికు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తక్షణ వైద్య సేవలు అందించి, సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్‌లోని ఓ ఆసుప్రతి అత్యవసర విభాగానికి తరలించారు. అయితే, అతన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. మృతుడిని జయబ్రత ఘోష్‌గా గుర్తించారు. మృతుడు ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో ప్రయాణించినట్లు అధికారులు పేర్కొన్నారు.