తిరుమలలో శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు రూ.35 వేలకు విక్రయించినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో తితిదే ఉద్యోగితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. దళారులు ఈ నెల 23న దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. టోకెన్ల తనిఖీ సమయంలో అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.