ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

AP New Corona Cases | ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,010 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,50,324కు చేరింది. తాజాగా 1,149 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 20,24,645 మంది కోలుకున్నారు. వైరస్‌తో మరో 13 మంది మృతి మృతి చెందగా.. మృతుల సంఖ్య 14,176కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 218, తూర్పుగోదావరిలో 175, ప్రకాశంలో 129, పశ్చిమ గోదావరిలో 115 కేసులు రికార్డయ్యాయి. కొవిడ్‌తో చిత్తూరులో ఐదుగురు, గుంటూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, వైఎస్సార్‌ కడప, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.