తెలంగాణ

Nagarjuna Sagar: 4 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 76591 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుంది. దీంతో డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది.

కాగా రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8221 క్యూ సెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32399 క్యూసె క్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు.

నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 74220 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 883.10 ( 205.2258 టీఎంసీలు ) వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 114133 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.