అంతర్జాతీయం

యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిప‌ణిని ప‌రీక్షించిన ఉత్త‌ర కొరియా

కొత్త త‌ర‌హా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్‌ను ఇవాళ ఉత్త‌ర కొరియా విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఇటీవ‌ల ఉత్త‌ర కొరియా వ‌రుస‌గా క్షిప‌ణుల‌ను ప‌రీక్షిస్తున్న విష‌యం తెలిసిందే. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్‌కు అసాధార‌ణ యుద్ధ సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు కొరియా న్యూస్ ఏజెన్సీ పేర్కొన్న‌ది. ఆ మిస్సైల్‌లో ట్విన్ ర‌బ్బ‌ర్ కంట్రోల్స్ ఉన్నాయ‌ని, వాటితో పాటు ఇత‌ర కొత్త టెక్నాల‌జీ స‌దుపాయాలు ఉన్న‌ట్లు చెప్పారు. లాంచ్ వెహికిల్ నుంచి ప్ర‌యోగించిన క్షిప‌ణి ఫోటోను రాండాంగ్ ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. అమెరికాలో ప్ర‌భుత్వ మార్పు జ‌రిగిన త‌ర్వాత ఇటీవ‌ల నార్త్ కొరియాలో వేగంగా ఆయుధ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే ఆ దేశం లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌తో పాటు బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను పరీక్షించిన విష‌యం తెలిసిందే. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిప‌ణి ప‌రీక్ష గురించి ద‌క్షిణ కొరియా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. బాలిస్టిక్ మిస్సైళ్ల క‌న్నా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైళ్లు చిన్న‌గా ఉంటాయి. వాటిని గుర్తించ‌డం సులువు కాదు. నార్త్ కొరియా తీరుపై చ‌ర్చించేందుకు అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్ భేటీకానున్నాయి.