ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణ పామాయిల్‌ గెలల అడ్డగింత

ట్రాక్టర్లను తిప్పిపంపిన ఆంధ్రా రైతులు
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన పామాయిల్‌ గెలలను అక్కడి రైతులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల నుంచి కొందరు రైతులు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలోని ఓ ప్రైవేటు కంపెనీకి పామాయిల్‌ గెలలను విక్రయించేందుకు తీసుకెళ్లారు. అయితే ఆ కంపెనీ ఆంధ్రా రైతులకు చెల్లించే ధర కంటే తెలంగాణలో పండిన గెలలకు టన్నుకు రూ.2 వేలు అధికంగా చెల్లిస్తున్నది. దీంతో తమకు అదే ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రాత్రి తెలంగాణ నుంచి వెళ్లిన 20 ట్రాక్టర్లను ఆంధ్రా రైతులు అడ్డుకొని తిప్పి పంపారు. దీంతో రైతులు అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలించి పామాయిల్‌ గెలలను విక్రయించారు.