జాతీయం ముఖ్యాంశాలు

ఇండియాలో కొత్త‌గా 24,354 పాజిటివ్ కేసులు

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 24,354 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 2,73,889గా ఉంది. గడిచిన 197 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య తొలిసారి త‌క్కువ‌గా న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. కొత్త‌గా న‌మోదు అయిన కేసుల్లో నిన్న‌టితో పోలిస్తే ఇవాళ 8.8 శాతం కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. మ‌రో వైపు కోవిడ్ వ్యాక్సినేష‌న్ వేగంగా జ‌రుగుతోంది. కేర‌ళ‌లో కొత్త‌గా 13,834 కేసులు న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో క‌రోనాతో నిన్న ఒక్క రోజే 95 మంది మ‌ర‌ణించారు. నిన్న ఒక రోజే కొత్త‌గా 14,29,258 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు ఐసీఎంఆర్ చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు 57,19,94,990 మందికి క‌రోనా టెస్టులు చేసిన‌ట్లు ఐసీఎంఆర్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.