ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

APPSC: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌ న్యూస్‌

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. త్వరలోనే 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ..‘‘త్వరలోనే జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. ఒక్కొక్కటిగా వివిధ శాఖలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం. గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకణంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాము’’ అని తెలిపారు.