రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం పట్ల బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రామాయంపేట బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు100 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, పిఏసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరి, సర్పంచ్ మైలారం శ్యామ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.