అంతర్జాతీయం

ల‌క్ష‌ల మంది చిన్నారుల్ని లైంగికంగా వేధించిన క్యాథ‌లిక్ చ‌ర్చి ఫాద‌ర్లు

ఫ్రాన్స్‌కు చెందిన క్యాథ‌లిక్ క్రైస్త‌వ పూజారులు కొన్ని ద‌శాబ్ధాల నుంచి చిన్నారుల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు. 1950 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్రాన్స్ క్యాథ‌లిక్ పూజారులు సుమారు 216000 మంది చిన్నారుల‌ను వేధించిన‌ట్లు ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. అయితే ఆ వేధింపుల సంఖ్య 3,30000 చేరుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా ఆ రిపోర్ట్‌లో వెల్ల‌డించారు. జీన్ మార్క్ సావే ఆ వేదిక‌కు హెడ్‌గా ఉన్నారు. ఆ రిపోర్ట్‌పై ఫ్రెంచ్ చ‌ర్చి షాక్ వ్య‌క్తం చేసింది. నివేదిక వెల్ల‌డించిన అంశాలు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయ‌ని, క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు ఫ్రెంచ్ చ‌ర్చి విభాగం కోరింది. రోమ‌న్ క్యాథ‌లిక్ చ‌ర్చిల్లో చాలా దారుణ‌మైన రీతిలో లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే తాజా రిపోర్ట్ అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు అయ్యింది. 2018లో ఫ్రాన్స్ క్యాథ‌లిక్ చ‌ర్చి ఈ అంశంపై విచార‌ణ‌కు ఆదేశించింది.