సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం విదితమే.
దాదాపు 7 గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వాట్సాప్‌తో పాటు మిగతా సేవలు పునరుద్ధరించబడ్డాయి. సాంకేతిక కారణాలతో ఈ మూడు సేవలు నిలిచిపోయాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు కొన్ని గంటల పాటు ఇబ్బందులు పడ్డారు.