జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 | ఐదుగురు పర్యాటకులకు కరోనా పాజిటివ్‌..

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు కరోనాకు పాజిటివ్‌గా పరీక్షించారు. వారంతా నైనిటాల్‌కు బయలుదేరే ముందు ఢిల్లీలో కొవిడ్‌ పరీక్షల కోసం స్వాబ్‌లు టెస్టుల కోసం ఇవ్వగా.. సోమవారం పాజిటివ్‌గా తేలింది. ఫలితాలు వెల్లడయ్యే సమయానికి పర్యాటకులు నైనిటాల్‌కు చేరుకున్నారు.

పర్యాటకుల గురించి సమాచారం అందుకున్న ఆరోగ్యశాఖ అధికారులు నైనిటాల్‌కు చేరుకొని టూరిస్ట్‌ల గురించి జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది. పర్యాటకుల ఆచూకీ కోసం అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. నైనిటాల్‌లోని బీడీ పాండే హాస్పిటల్‌ ప్రిన్సిపల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ ధామి మాట్లాడుతూ సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ సమాచారం అందలేదన్నారు. పోలీసులకు సైతం సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.