ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ పై ఐటీ అధికారుల సోదాలు మూడో రోజు కూడా జరిగాయి. సంస్థ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ముఖ్యమైన అధికారులు, ఉద్యోగుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. వందల కోట్ల రూపాయల నగదును కంపెనీ ఉద్యోగుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకూ పలుచోట్ల నుంచి రూ.200 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బోరబండలోని ఓ ఫ్లాట్‌లో భారీ స్థాయిలో నగదు లభ్యమైనట్లు సమాచారం. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును బ్యాంకుకు తరలించారు. కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లలో లభ్యమైన నగదుకి సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు తెలుస్తోంది.