కరోనా మహమ్మారి రెండో దశలో దేశాన్ని వణికించింది. సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అని నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆగ్రాకు చెందిన వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో డెల్టా స్ట్రెయిన్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ఫస్ట్ వేవ్‌లో వైరస్ బారినపడిన వ్యక్తులతో పోలిస్తే సెకండ్ వేవ్‌లో డెల్టా స్ట్రెయిన్ పాజిటివ్‌గా పరీక్షించిన వ్యక్తుల్లో రెండు రెట్లు ఎక్కువ యాంటీబాడీస్‌ను గుర్తించారు.
మొదటి వేవ్‌లో వైరస్ సోకిన వారిలో యాంటీబాడీస్ గరిష్ఠంగా 500 IU/ml ఉత్పత్తి అవగా.. రెండో వేవ్ వైరస్ బారినపడ్డ వ్యక్తుల్లో 1000 IU/ml వరకు ప్రతిరోధకాలు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే, వీరంతా టీకాలు వేయించుకోని వ్యక్తులని వైద్యులు పేర్కొన్నారు. ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీకి చెందిన రక్తమార్పిడి మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నీతూ చౌహాన్ మాట్లాడుతూ.. ఏప్రిల్-మే నెలలో వైరస్ సోకిన 121 మంది వ్యక్తులను పరిశీలించగా.. వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.
ఇందులో 63 మందిలో 100 నుంచి 1000 IU/ml (International Units per ml) వరకు యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీలో 2,850 మంది యాంటీబాడీస్‌పై పరీక్షలు నిర్వహించారు. సెకండ్ వేవ్‌లో వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత రెండు మోతాదుల టీకా తీసుకున్న వ్యక్తుల్లో 25వేల IU/ml వరకు యాంటీబాడీస్ ఉన్నట్లు కనుగొన్నారు. వైరస్ బారినపడని, టీకాలు వేయించుకున్న వ్యక్తుల్లో మెరుగ్గా ప్రతిరోధకాలు కలిగి ఉన్నారని తేలింది.
ఇందులో 2000 నుంచి 10వేల IU / ml ప్రతిరోధకాలు గుర్తించారు. మొదటి వేవ్‌లో కొవిడ్ సోకిన 12 నెలల తర్వాత కూడా ప్రతిరక్షకాలు ఉంటాయని, ఫస్ట్ వేవ్‌లో తరంగంలో సోకిన 70 మందిలో 100 నుంచి 250 IU / ml యాంటీబాడీస్ ఉన్నాయని తేలింది. ఈ సందర్భంగా ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీలో రోగులకు చికిత్స అందించిన డాక్టర్ ఆశిష్ గౌతమ్ మాట్లాడుతూ.. సెకండ్ వేవ్‌లో డెల్టా స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు చెప్పారు.
ఈ స్ట్రెయిన్ ప్రమాదకరమైందని, ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు. అయితే, వైరస్ లక్షణాలు ఎక్కువ, తీవ్రమైన కేసుల్లో రోగులు యాంటీబాడీలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సాధారణ లక్షణాలు ఉన్న వారిలో ప్రతిరోధకాలు కూడా తక్కువగా ఉత్పిత్తి అయ్యాయని, చాలా మందిలో నిర్ధేశించిన 132 IU/ml కంటే తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.