జాతీయం ముఖ్యాంశాలు

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో చరిత్ర నుంచే 20 ప్రశ్నలు.. ‘కీ’ విడుదల చేసిన సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ప్రాథమిక పరీక్షను ఆదివారం నిర్వహించింది. పరీక్ష ఇంతకు ముందు జూన్‌ 29న జరుగాల్సి ఉండగా.. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో వాయిదా పడింది. యూపీఎస్‌సీ సీఎస్‌సీ ప్రిలిమ్స్‌ దేశవ్యాప్తంగా ఇవాళ 77 ప్రాంతాల్లో జరిగింది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పరీక్షలు కొనసాగాయి. మొదటి పేపర్‌లో గతంలో మాదిరిలా కాకుండా చరిత్ర నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. ఇందులో ఎక్కువగా ఆధునిక చరిత్ర, కళలు, సంస్కృతి నుంచి ఇచ్చారు. రాజ్యాంగం నుంచి దాదాపు 15-16 ప్రశ్నలు అడిగారు. అలాగే ఈ ఏడాది క్రీడా విభాగం నుంచి కొన్ని ప్రశ్నలు అడిగారు. క్రికెట్‌ టెస్ట్‌ సిరిస్‌లో ఒకటి సహా క్రీడల నుంచి మూడు ప్రశ్నలున్నాయి.

కాగా, హైదరాబాద్‌లోని సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ ప్రిలిమ్స్‌ ‘కీ’ విడుదల చేసింది. ( ఈ ‘కీ’ పేపర్‌ విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. యూపీఎస్‌సీ విడుదల చేసిన ‘కీ’ పేపర్‌నే ఫైనల్‌.. గమనించగలరు)