జాతీయం

Priest molests girl | పూరీ జగన్నాథ్‌ ఆలయంలో బాలికకు వేధింపులు.. పూజారి అరెస్ట్‌

ఒడిశా పూరీలోని జగన్నాథుడి ఆలయంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. దైవ దర్శనం కోసం వచ్చిన 12 బాలికపై ఆలయంలో పని చేసే ఓ పూజారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సదరు పూజారిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన బాలిక కుటుంబంతో కలిసి పూరీ జగన్నాథుడి ఆలయానికి వెళ్లింది. దేవాలయంలో 136 ఉప ఆలయాలున్నాయి. బాలిక తల్లిదండ్రులు ప్రధాన ఆలయంలో ఉన్నారు.

బాలిక బమనా ఆలయంలో ఒంటరిగా ఉండడా.. పూజారి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సమయంలో సంఘటన జరిగింది. బమనా ఆలయం నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లి బాలిక జరిగిన సంఘటన గురించి తన తల్లికి వివరించింది. దీంతో సదరు పూజారిపై సింఘద్వార్ పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సదరు పూజారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత సంక్షేమ కమిటీ చీఫ్‌కుసమాచారం అందించారు. బాలిక వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేశామని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ సూపరింటెండెంట్‌ కేపీ సింగ్‌ తెలిపారు.