ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఇళ్ల పథకంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : బొత్స

పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు బాధకలిగించిందని, దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్సార్‌ ఆసరా చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడారు. ప్రభుత్వం వివరణ తీసుకోకుండా తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు.

ప్రతి మహిళా ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల పథకం తీసుకొచ్చామని, కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కేంద్ర విధివిధానాలతోనే పథకం చేపట్టామని, రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పథకాన్ని అడ్డుకుంటే ప్రజలకు దిక్కెవరన్నారు. రాజ్యాంగ విరుద్ధంగానే పథకాలు అమలు చేస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు.

ఇదిలా ఉండగా.. ఇళ్ల నిర్మాణానికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీ అధ్యయనం చేయించాలని ఏపీ హైకోర్టు శుక్రవారం సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. గుంటూరులో హోంశాఖ మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. గతంలో ఎవరూ పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదన్నారు. ఒకే గదిలో ఉంటూ అద్దె ఇండ్లలో ఇబ్బందులుపడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలు పెట్టడం సరికాదన్నారు.