కరోనాకు మొట్టమొదటగా మేమే వ్యాక్సిన్ తయారు చేశామన్న గొప్ప కోసం రష్యా దొంగతనానికి పాల్పడిందా.. ఆక్స్‌ఫర్డ్ టీకా తయారీ ప్రణాళికను కొట్టేసిందా.. అంటే బ్రిటన్ భద్రతా వర్గాలు నిజమేనని అంటున్నాయి. రష్యా గూఢచారులు ఆక్స్‌ఫర్డ్ టీకా సమాచారం దొంగిలించి దాని ఆధారంగా స్పుత్నిక్ వీ టీకా తయారు చేశారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని బ్రిటన్ భద్రతా విభాగం మంత్రులకు చెప్పినట్టు సమాచారం. తాము కరోనాకు టీకా తయారు చేస్తున్నామని ప్రకటించిన తర్వాత ఆక్స్‌ఫర్డ్ వర్సిటీపై రష్యా హ్యాకర్లు పలుమార్లు సైబర్ దాడికి పాల్పడ్డారు.
ఆక్స్‌ఫర్డ్ సమాచారం కొట్టేసి స్పుత్నిక్ వీ తయారీ?