జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 | దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరింది. ఇందులో 3,35,97,339 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,55,653 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,62,661 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడింది. యాక్టివ్‌ కేసులు ఇంత తక్కువగా ఉండటం గత 242 రోజుల్లో ఇదే మొదటిసారని పేర్కొన్నది.

కాగా, గత 24 గంటల్లో 14021 మంది కరోనా నుంచి కోలుకోగా, 585 మంది మృతిచెందారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. నిన్న ఒక్కరోజే 55,89,124 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. దీంతో మొత్తంగా 1,03,53,25,577 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది.