జాతీయం ముఖ్యాంశాలు

వచ్చే నెల 30 నుంచి ఇంజినీరింగ్‌ తొలి ఏడాది తరగతులు

ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో మొదటి ఏడాది విద్యార్థులకు వచ్చే నెల 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. మిగతా తరగతుల విద్యార్థులకు ఈ నెల 1 నుంచే తరగతులు మొదలయ్యాయి. కాగా, సవరించిన షెడ్యూల్‌ ప్రకారం తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్‌ 15 నుంచి అడ్మిషన్‌ ప్రక్రియ మొదలవుతుందని, 30 నుంచి తరగతులు మొదలవుతాయని ఏఐసీటీఈ తెలిపింది. ముందటి షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తయిన కళాశాలలకు ఇది వర్తించదని పేర్కొన్నది. ఒక వేళ ఖాళీ సీట్లకు కొత్త విద్యార్థులను చేర్చుకుంటే, ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టంచేసింది. విద్యార్థులు అడ్మిషన్‌ రద్దు చేసుకోవడానికి (పూర్తి రీఫండ్‌తో) గడువును వచ్చే నెల 25 వరకు పొడిగించినట్టు వెల్లడించింది.