China on Thaiwan | తైవాన్ .. చైనా విలీం అంతర్భాగం కావడం -మినహా మరో మార్గం లేదని డ్రాగన్ తేల్చేసింది. తైవాన్‌కు అంతర్జాతీయంగా ఎటువంటి గుర్తింపు లేదని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. తైవాన్‌కు ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భాగస్వామ్యం కల్పించడానికి మద్దతు తెలుపుతామని ఇటీవల అమెరికా విదేశాంగశాఖ మంత్రి అంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యలపై చైనా రియాక్టయింది.
జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు రోమ్‌కు చేరుకున్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ.. 50 ఏండ్ల క్రితమే అమెరికాతోపాటు పలు దేశాలు వన్ చైనా సూత్రాన్ని నిలుపలేకపోయాయని, 21వ శతాబ్ధిలోనూ ఆ అవకాశాలు సక్సెస్ కావడం తక్కువ అని అన్నారు. వన్ చైనా సూత్రాన్ని నిలువరించేందుకు పట్టుదలకు పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కొన్నాళ్లుగా తైవాన్ తమ భూభాగంలోకే వస్తుందంటూ దానిపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతున్నది. ఇటీవల 52 యుద్ధ విమానాలను తైవాన్ సరిహద్దుల్లోకి పంపడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్‌కు మద్దతుగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. చైనాతో దౌత్యసంబంధాలు నెలకొల్పుకునేందుకు ఇచ్చిన హామీని కొన్ని దేశాలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయని డ్రాగన్ ఆరోపించింది.