కరోనా మహమ్మారి కుదిపేసిన మహారాష్ట్ర ఆ వైరస్ రక్కసి బారి నుంచి మెల్లగా బయటపడుతున్నది. రాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం తొలిసారి ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. గత ఏడాది మార్చి నుంచి శనివారం వరకు ప్రతి రోజు కరోనా కేసులతోపాటు మరణాలు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో కొత్తగా 367 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడిన వారెవరూ మరణించలేదు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం 2020 మార్చి 26న కూడా జీరో మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ముంబైలో కరోనా కేసుల సంఖ్య 7,50,808కి, కరోనా మరణాల సంఖ్య 16,180కి చేరింది.
ముంబైలో తొలిసారి జీరో కరోనా మరణాలు