అంతర్జాతీయం

కొవాగ్జిన్‌కు ఆస్ట్రేలియా గుర్తింపు

భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాను ఆస్ట్రేలియా సోమవారం అధికారికంగా గుర్తించింది. కొవాగ్జిన్‌ టీకా వేసుకొన్నవారు తమ దేశంలోకి రావడానికి అనుమతించింది. దాదాపు 20 నెలల తర్వాత ఆస్ట్రేలియా అంతర్జాతీయ సరిహద్దులను తెరిచింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించింది. విదేశీ ప్రయాణికులు రావడానికి అనుమతినిచ్చింది. కరోనా బయటపడ్డ తొలినాళ్లలోనే సరిహద్దులు మూసివేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి.