తెలంగాణ

Srsp Project | ఎస్సారెస్పీలోకి 10,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి సోమవారం అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 10,700 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. దీంతో రెండు వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 3,120 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అదే విధంగా ఎస్కేప్‌ గేట్ల నుంచి గోదావరిలోకి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి అంతేస్థాయిలో ఉందని తెలిపారు.

ఈ సీజన్‌లో ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 672.614 టీఎంసీల వరద వచ్చిందన్నారు. కాలువలకు, గోదావరిలోకి 600.738 టీఎంసీల మిగులు జలాలను విడుదల చేసినట్లు ఏఈఈ తెలిపారు.