తెలంగాణ

Huzurabad | ‘రోటీమేక‌ర్’ కింద న‌లిగిపోతున్న‌ ‘హ‌స్తం’

Huzurabad |హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ, కాంగ్రెస్ ర‌హ‌స్య పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి స్వ‌తంత్ర అభ్యుర్థుల‌తో పోటీ ప‌డుతున్నాడు. ప్ర‌జా ఏక్తా పార్టీ అభ్య‌ర్థి సిలివేరు శ్రీ‌కాంత్‌తో.. జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ పోటీ ప‌డుతున్నారు. ఏడో రౌండ్‌లో వెంక‌ట్ కంటే, శ్రీ‌కాంత్‌కే ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. హ‌స్తం అభ్య‌ర్థికి ఏడో రౌండ్‌లో 94 ఓట్లు రాగా, ప్ర‌జా ఏక్తా పార్టీ అభ్య‌ర్థి రోటీమేక‌ర్ గుర్తుతో బ‌రిలోకి దిగిన‌ శ్రీ‌కాంత్‌కు 98 ఓట్లు వ‌చ్చాయి. ఓ ప్ర‌ధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థి.. స్వంత‌త్ర అభ్య‌ర్థుల‌తో పాటుగా ప్ర‌తీరౌండ్‌లోనూ కేవలం వంద‌లోపు ఓట్లు మాత్ర‌మే తెచ్చుకుంటున్నాడు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.