ఆంధ్రప్రదేశ్

Badvel By Election | బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో బీజేపీ డిపాజిట్ గ‌ల్లంతు

Badvel By Election | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ డిపాజిట్ గ‌ల్లంతు అయింది. అధికార వైఎస్సార్‌సీపీ మొద‌టి రౌండ్ నుంచి ఏక‌ప‌క్షంగా ఫ‌లితాల‌ను న‌మోదు చేసి ఘ‌న విజ‌యం సాధించింది. 90,411 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ గెలుపొందారు. బీజేపీ అభ్య‌ర్థి సురేశ్‌కు 21 వేల పైచిలుకు ఓట్లు పోల‌వ్వ‌గా, కాంగ్రెస్ అభ్య‌ర్థి క‌మ‌లమ్మ‌కు 6 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి.