Covid-19 in EU | వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్-19 భారీన పడి మరో ఐదు లక్షల మంది మృత్యువాత పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం యూరప్ రీజియన్ పరిధిలో 53 దేశాల్లో కరోనా వ్యాపించి ఉందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే గురువారం మీడియాకు చెప్పారు. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే, యూరప్ దేశాల్లో మరో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
రష్యా, బ్రిటన్ తదితర దేశాల్లో కోవిడ్-19 మరణ మృదంగం మోగుతున్నది. తాజా కేసుల నేపథ్యంలో పలు యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో యూరోపియన్ యూనియన్ రీజియన్ పరిధిలో సెంట్రల్ ఆసియా పరిధిలోని పలు దేశాలతోపాటు 53 ఈయూ దేశాలు వస్తాయి. మహమ్మరి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు.