అంతర్జాతీయం

Indonasia Rains: ఇండోనేషియాలో భారీ వ‌ర్షాలు.. పోటెత్తిన వ‌ర‌ద‌లు

ఇండోనేషియాలో భారీ వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఎడ‌తెగ‌ని వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. దాంతో లోత‌ట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. ప‌లుచోట్ల కొండ‌చరియ‌లు విరిగిప‌డ్డాయి. జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. బోన్ బొలాంగో రిజెన్సీలో కొండ‌చరియ‌లు విరిగిప‌డి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌పడ్డారు. దేశంలో ప‌రిస్థితిని చూస్తుంటే మృతులు, క్ష‌త‌గాత్రుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని అధికారులు పేర్కొన్నారు.