దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 108.47కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక నివేదికల ప్రకారం.. ఇవాళ ఉదయం 7 గంటల వరకు దేశంలో 1,09,98,126 సెషన్ల ద్వారా 1,08,47,23,042 డోసులు వేశారు. గత 24గంటల్లో 23లక్షలుకుపైగా టీకాలు వేసినట్లు పేర్కొన్నది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం.. 1,03,79,606 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు మొదటి డోసు, మరో 92,69,660 మంది రెండో డోసు వేసినట్లు పేర్కొన్నది.
ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌లో 1,83,72,723 మందికి ఫస్ట్.. మరో 1,60,37,946 మందికి సెకండ్ డోసు పంపిణీచేసినట్లు తెలిపింది. 18-44 ఏజ్ గ్రూప్‌లో 42,45,43,385 మందికి మొదటి.. 15,14,76,624 మందికి రెండో డోసు టీకా వేశామని, 45-59 ఏజ్‌గ్రూప్‌లో 17,63,88,452 మంది మొదటి.. 9,93,34,705 మంది లబ్ధిదారులు రెండో డోసు టీకా తీసుకున్నారని చెప్పింది. 60 ఏళ్లుపైబడిన 11,06,32,907 మంది తొలి, 6,82,87,034 మంది సెకండ్ డోస్ టీకా తీసుకున్నట్లు వివరించింది.