తెలంగాణ ముఖ్యాంశాలు

రాష్ట్రంలో కొత్త‌గా 404 మ‌ద్యం షాపులు..

తెలంగాణ‌లో డిసెంబ‌ర్ నుంచి నూత‌న మ‌ద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కొత్త‌గా 404 మ‌ద్యం దుకాణాలు పెంచారు. దీంతో మ‌ద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెంచారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌ల‌కు దుకాణాల కేటాయింపు ప్ర‌క్రియ పూర్త‌యింది. గౌడ్‌ల‌కు 363, ఎస్సీల‌కు 262, ఎస్టీల‌కు 131 దుకాణాల‌ను కేటాయించారు. ఓపెన్ క్యాట‌గిరీ కింద మిగిలిన మ‌ద్యం దుకాణాలు 1,864. కాగా, రేప‌ట్నుంచి ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 20న డ్రా ద్వారా మ‌ద్యం దుకాణాల‌ను కేటాయించ‌నున్నారు. సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు గౌడ్‌ల‌కు 15 శాతం, ఎస్సీల‌కు 10 శాతం, ఎస్టీల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ శ‌నివారం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.