తెలంగాణ

రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ఫై సీఎం కేసీఆర్ క్లారిటీ…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ ముందు వరకు కూడా పదులు , వందలు సంఖ్య లో కొత్త కేసులు వెలుగులోకి రాగా..న్యూ ఇయర్ అనంతరం ప్రతి రోజు కూడా రెండు వేలకు పైగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు…అది కూడా సంక్రాంతి పండగ అనంతరం పెట్టబోతుందనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ అనే వార్తలను ఖండిస్తున్నాని..ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని..ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో అన్ని సౌక‌ర్యాలు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఆక్సిజ‌న్ బెడ్స్ తో పాటు మ‌రిన్నీ ఏర్పాట్టు చేస్తున్నామ‌ని వివ‌రించారు. క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ ప‌ట్ల ప్ర‌జ‌లు జగ్ర‌త్తగా ఉండాల‌ని ..ప్ర‌జ‌లంద‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని తెలిపారు. అలాగే తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు కరోనా ఆంక్షలు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

పబుల్‌, రెస్టారెంట్ల, భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం, ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు, సభలకు అనుమతుల నిరాకరణ వంటి ఆంక్షాలను ప్రభుత్వం జనవరి 10 వ తేదీ వరకు అమలు చేయాలని ముందుగా నిర్ణయం తీసుకుంది. అయితే… ఆ గడువు ఈరోజు తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అలాగే పెరుగుతున్న నేపథ్యంలో… కరోనా ఆంక్షలను ఈ నెల 20 వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.