తెలంగాణ

Nallagonda | ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరికలు

పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఎం పార్టీల నుంచి 150మంది సర్పంచ్ కొండ సరిత సైదులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ..రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు.
నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. పార్టీలో చేరిన వారిలో చింతమల్ల శేషు, కంకుంట్ల లక్ష్మయ్య, మేకల యాదగిరి, విశేష, మంగమ్మ, ముత్తయ్య, సుదర్శన్ తదితరులున్నారు.