దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనబడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వందకు పైగానే ఉన్నది. మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉన్నది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38, లీటర్ డీజిల్ ధర రూ.94.78గా ఉన్నది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.36,డీజిల్ ధర రూ.94.75గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.99గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.36గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.35,డీజిల్ ధర రూ.94.76గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88, లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.71
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.71,లీటర్ డీజిల్ ధర రూ.96.77లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.22, డీజిల్ ధర రూ. 96.05గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.77, డీజిల్ ధర రూ.95.57గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.86గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.91గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.71,డీజిల్ రూ.96.77లకు లభిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97,లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40, డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.67, డీజిల్ ధర రూ.85.10గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28,లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.