ఈ నెల 18న తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం గురువారం పశ్చిమ దిశగా ప్రయాణించి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని అంచనా వేసింది. కర్ణాటక తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా మరో అల్పపీడనం కొనసాగుతుందని, రాబోయే 48 గంటల్లో పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతుందన్నారు. కర్ణాటక తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా మరో అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొన్నది.
తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా దక్షిణ మహారాష్ట్ర, గోవా తీరాల మీదుగా ఉత్తర కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, దక్షిణ కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజులు, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 18న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ కోస్తాంధ్రలో భారీ పడుతాయని చెప్పింది. దక్షిణ ఆంధ్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.