తెలంగాణ

సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

ఆంధ్రలోని ఏలూరు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన అశోక్ కేసరి, సంజయ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని వివరించారు. .. మార్కెట్లో గంజాయి విలువ 25 లక్షలు
సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్

వీరు లారీకి ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సమావేశంలో జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు, సీఐ రాజశేఖర్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఆర్ ఎస్ఐలు కాశీనాథ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.