తెలంగాణ ముఖ్యాంశాలు

Rain Alert | తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఈ నెల 18 వరకు ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు తీరం వద్ద నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా గురువారం చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుంచి 24 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్ట పేర్కొన్నారు.