ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా నాయకుల్ని అభినందించిన సీఎం జగన్‌

శాసనసభ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలో ఘనవిజం సాధించినందుకు మంత్రి శంకరనారాయణను, జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్‌ అభినందించారు. 

కాగా, పెనుకొండ నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడిన, ప్రలోభపెట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు. ఫలితంగా 20 వార్డులున్న నగర పంచాయతీలో ఏకంగా 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ జిల్లా నేతలంతా పెనుకొండలోనే మకాం వేసి కుట్ర రాజకీయాలు చేసినా ఆ పార్టీ రెండు స్థానాల (1,3వార్డులు)ను మాత్రమే దక్కించుకోగలిగింది.