జాతీయం ముఖ్యాంశాలు

Badrinath Temple: ఇర‌వై క్వింటాళ్ల పూల‌తో స‌ర్వాంగ‌సుంద‌రంగా బ‌ద్రీనాథ్ ఆల‌య అలంక‌ర‌ణ..!

చార్‌ధామ్‌లోని ప‌విత్ర పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టైన బ‌ద్రీనాథ్ ఆల‌యం ( Badrinath Temple ) స‌ర్వాంగ‌సుంద‌రంగా ముస్తాబైంది. ఇర‌వై క్వింటాళ్ల పూల‌తో చూడ‌చ‌క్క‌గా అలంక‌రించారు. పూల‌తో అలంక‌రించిన క్షేత్రం లైట్ల మ‌ధ్య ద‌గ‌ద‌గ మెరిసిపోతున్న‌ది. ఆల‌య అందాల‌ను చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వు. శీతాకాలం సంద‌ర్భంగా రేప‌టి నుంచి ఆల‌య ద్వారాల‌ను మూసివేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆల‌యాన్ని అపురూపంగా అలంక‌రించి పూజ‌లు నిర్వ‌హించారు. పూలు, దీప కాంతుల న‌డుమ ద‌గ‌ద‌గ మెరుస్తున్న ఆల‌య అందాల‌ను ఈ కింది వీడియోలో మీరు కూడా ఒక‌సారి వీక్షించండి.