Nandamuri Balakrishna | ఇప్పటివరకూ సహించాం భరించాం..ఎప్పుడైనా ఆవేశం వస్తే చంద్రబాబు ఆలోచించి మమ్మల్ని ఆపేవారు. విర్రవీగి మాట్లాడేవారు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలంటూ బాలకృష్ణ హెచ్చరించారు. ఫ్యామిలీని టచ్ చేసి చూశారు..ఇక ఇంకోసారి..ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. నందమూరి ఆడవారిని గురించి ఎవరైనా మాట్లాడితే..హద్దు మీరి ప్రవర్తిస్తే..నోటికొచ్చినట్లు వాగితే…ఖబర్దార్ అంటూ వేలు చూపిస్తూ…వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు వ్యక్తిగతమైన విషయాలు తీసుకువచ్చారని గరమయ్యారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని, రాజకీయం రాజకీయనేతల మధ్య ఉండాలి..కుటుంబాల మధ్య కాదు. చట్టసభల్లో ఉండి ఇలాంటి మాటలా…? అసెంబ్లీలో ఉన్నారా..? గొడ్ల చావిడిలో ఉన్నారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి