Uncategorized

పార్లమెంట్‌ మార్చ్‌ రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

  • భవిష్యత్‌ కార్యాచరణపై నేడు భేటీ: ఎస్కేఎం

nపార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రోజూ పార్లమెంటుకు 500 ట్రాక్టర్లలో ర్యాలీగా వెళ్లాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తెలిపింది. ఈ అంశంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమానికి ఈ నెల 26తో ఏడాది పూర్తవుతుందని, దీనిని పురస్కరించుకొని ఢిల్లీ సరిహద్దుల్లోని దీక్షా శిబిరాలకు రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ.. తమ డిమాండ్లు అన్నీ నెరవేరేవరకూ ఆందోళన కొనసాగుతుందని తెలిపింది.